KMM: సీతారామ ప్రాజెక్టు ద్వారా సత్తుపల్లి ట్రంక్ పరిధిలోని ఆయకట్టు రైతులకు సాగునీరు అందించే ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. మూడో పంప్‌హౌస్ నుంచి నాలుగో పంప్‌హౌస్ మధ్య అవసరమైన భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.45 కోట్లు విడుదల చేసింది. దమ్మపేట, అశ్వారావుపేట మండలాల పరిధిలో మొత్తం 532 ఎకరాల భూమి సేకరణకు ఈ నిధులను వినియోగించనున్నారు.
తెలంగాణ
భూమి సేకరణకు నిధుల విడుదల


