హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: దోశలో పురుగు.. హోటల్‌ను తనిఖీ చేయాలని డిమాండ్

BHNG: బీబీనగర్ గూడూరు టోల్ ప్లాజా వద్ద ఉన్న రాఘవేంద్ర హోటల్లో దోశ తింటున్న ఓ కస్టమర్‌కు అందులో పురుగు కనిపించింది. దీంతో సదరు వ్యక్తి ఒక్కసారిగా షాకు గురయ్యాడు. హోటల్లో ఆహార పదార్థాల తయారీ, పరిశుభ్రతపై నిర్లక్ష్యం వహిస్తున్నారని కస్టమర్లు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత ఆహార భద్రత అధికారులు స్పందించి హోటల్‌ను తనిఖీ చేసి, చర్య తీసుకోవాలని కోరారు.