E.G: చక్రద్వారబంధంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను భర్త అత్యంత దారుణంగా హత్య చేశాడు. భార్య కుమారి, భర్త నాగరాజుకు కొంతకాలంగా దూరంగా ఉంటుంది. అయితే భార్య విడిగా ఉండటంపై తీవ్ర ఆగ్రహంతో నాగరాజు, కుమారి వద్దకు వచ్చి ఆమెతో గొడవపడి ఆవేశంలో గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
ఆంధ్రప్రదేశ్
భార్యను గొంతు నులిమి చంపిన భర్త


