హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వీటిని అదుపుచేసే నాథుడే లేడా..?

SKLM: కవిటీ(మం), ఆర్. బెలగాంలో కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు అటవీ శాఖ అధికారులను కోరారు. అటవీశాఖ అధికారులు, మెమోరియల్ ఫౌండేషన్ ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, గ్రామస్థులు సమావేశమై దీనిపై చర్చించారు. గ్రామస్థులు మాట్లాడుతూ.. కోతులు పంటలు, తోటలను ధ్వంసం చేస్తున్నాయని ప్రజల వాపోతున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులను సంప్రదించి చర్యలు చేపడతామని తెలిపారు.