హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

JN: దేవరుప్పుల మండలం పెద్దమడూరు గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. బహుజనుల హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం పోరాడిన యోధుడు సర్వాయి పాపన్న అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.