హైదరాబాద్: 28°C
తెలంగాణ

చింతకర్ర-తాడిగూడ రహదారి బురదమయం.. రాకపోకలకు ఇబ్బంది

ASF: జైనూర్ మండలం చింతకర్ర-తాడిగూడ గ్రామాల మధ్య రహదారి వర్షాలకు పూర్తిగా బురదమయమైంది. ద్విచక్ర వాహనాలతో పాటు ఇతర వాహనాలు సైతం వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అత్యవసర పనులపై రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరారు.