హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రోడ్డుపై మట్టి పేరుకుపోయి చోటు చేసుకుంటున్న ప్రమాదాలు

MNCL: మందమర్రి మండలం వెంకటాపూర్ గ్రామ రహదారిపై మట్టి పేరుకుపోయి ద్విచక్రవాహనాలు జారిపడుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. మట్టితో ట్రాక్టర్లు రాకపోకలు సాగించడంతో రోడ్డుపై మట్టి నిలుస్తోందని తెలిపారు. దీంతో బైక్‌లు అదుపుతప్పి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. గ్రామపంచాయతీ అధికారులు స్పందించి రోడ్డుపై పేరుకుపోయిన మట్టితొలగించాలని కోరుతున్నారు.