హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓపెన్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తుకు గడువు పెంపు

కోనసీమ: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం 2026-27 విద్యా సంవత్సరానికి 10వ తరగతి, ఇంటర్ ప్రవేశాల గడువును పెంచినట్లు మామిడికుదురు ZPHS స్కూల్ HM చిరంజీవిరావు మంగళవారం తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు పూర్తి వివరాలకు అసిస్టెంట్ కో-ఆర్డినేటర్ భూపతి మనోహర్ రాజును సంప్రదించాలని సూచించారు.