హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాడిపత్రిలో భారీగా గోవా మద్యం పట్టివేత

ATP: తాడిపత్రిలో అక్రమంగా తరలిస్తున్న గోవా మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. లారీ క్యాబిన్‌ వెనుక ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాక్స్‌లో దాచిన 400 ఫుల్‌ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి తాడిపత్రికి అక్రమంగా మద్యం తరలిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లారీలో గుట్టుచప్పుడు కాకుండా మద్యం తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.