హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

BHIMA UDA ఏర్పాటుపై డిప్యూటీ స్పీకర్ హర్షం

W.G: భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (BHIMA UDA) ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ఉండి MLA, ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు మంగళవారం హర్షం వ్యక్తం చేశారు. భీమవరానికి చెందిన నిధులు ఏలూరులో జమ చేయడం సరికాదని తాము చేసిన వాదనను ప్రభుత్వం మన్నించి, 'BHIMA UDA' ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు.