హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆన్‌లైన్ గేమ్స్ వద్దనందుకు మామను చంపేశాడు..!

చిత్తూరు: పూతలపట్టు(M) రంగంపేట ST కాలనీలో జరిగిన హత్య ఘటనపై మృతుడి కుమార్తె వివరాలు వెల్లడించారు. 'నా భర్త అశోక్ నిత్యం ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతూ అప్పుల్లో కూరుకుపోయాడు. ఇదేక్రమంలో మా అక్కతోనూ గొడవ పడేవాడు. గేమ్స్ ఎందుకు ఆడుతున్నావని మా నాన్న సుబ్రహ్మణ్యం ప్రశ్నించారు. మద్యం మత్తులో ఉన్న నా భర్త ఒక్కసారిగా దాడి చేసి మా నాన్నను చంపేశాడు' అని ఆమె బోరున విలపించారు.