హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్‌ బియ్యం పట్టివేత.!

KMR: కారులో అక్రమంగా తరలిస్తున్న ప్రజా పంపిణీ బియ్యాన్ని పట్టుకున్నట్లు తాడ్వాయి ఎస్సై నరేష్ తెలిపారు. మంగళవారం పౌరసరఫరాల శాఖ డీటీ తిరుపతి ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అక్రమంగా తరలిస్తున్న 14 బియ్యం సంచుల్లో మొత్తం 6 క్వింటాళ్ల 72 కిలోల బియ్యాన్ని పట్టుకున్నట్లు వివరించారు.