హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బస్టాండ్ లేక ప్రయాణికుల అవస్థలు

NTR: కంచికచర్ల మండలం కీసరలో సరైన బస్టాండ్ సౌకర్యం లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సుల కోసం నిత్యం జాతీయ రహదారిపైనే వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. జాతీయ రహదారిపై వాహనాలు వేగంగా రాకపోకలు సాగిస్తుండటంతో ఎప్పుడు ఏ వాహనం ఢీకొడుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అధికారుల స్పందించి బస్టాండ్ నిర్మించాలని కోరుతున్నాను.