KRNL: చిన్నహరివాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆదోని వడ్డేగేరికి చెందిన రాము, కర్ణాటకకు చెందిన లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. దంపతుల మధ్య విభేదాలతో లక్ష్మి కుమారుడితో పుట్టింటికి వెళ్లింది. సోమవారం రాము బాలుడిని తీసుకుని బైక్‌పై వస్తుండగా ఎల్‌ఎల్‌సీ కాలువ డివైడర్‌ను ఢీకొట్టాడు. ప్రమాదంలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో రెండేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు!


