కృష్ణా: కలెక్టర్ డీకే బాలాజీకి హైకోర్టు షాక్ ఇచ్చింది. మోపిదేవి గ్రామంలో ఆక్రమణల తొలగింపుపై హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై వివరణ ఇవ్వాలంటూ నోటీసు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించకుండా ధిక్కరణకు పాల్పడ్డారంటూ విచారణ చేపట్టింది. కాగా, ప్రతివాదుల్లో ఒకరైన కలెక్టరును సెప్టెంబరు 15న వ్యక్తిగతంగా, న్యాయవాది ద్వారా హైకోర్టుకు హాజరు కావాలని స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్
కలెక్టర్‌కు షోకాజ్ నోటీసు


