హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పోలీసుల పిల్లలకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు'

BPT: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటి సాధనకు కృషి చేయాలని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ పిలుపునిచ్చారు. చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 24 మంది పోలీసు సిబ్బంది పిల్లలను ఆయన అభినందించారు. పోలీస్ వెల్ఫేర్ విభాగం ద్వారా మంజూరైన రూ. 3.43 లక్షల విలువైన స్కాలర్‌షిప్ చెక్కులను విద్యార్థులకు స్వయంగా అందజేశారు.