SKLM: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్‌కి ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరావు మంగళవారం ఘన స్వాగతం పలికారు. భోగాపురం విచ్చేసిన నితిన్ నబీన్‌కి ఎమ్మెల్యే ఈశ్వరావు పూలమాల వేసి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి, నినాదాలతో హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నితిన్ నబీన్‌కు ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఘన స్వాగతం


