హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖలో నితిన్ నబిన్.. వాజ్‌పేయీకి నివాళి

విశాఖ బీచ్ రోడ్‌లోని పార్క్ హోటల్ వద్ద ఉన్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ విగ్రహానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ మంగళవారం ఉదయం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, జిల్లా అధ్యక్షుడు పరశురామ్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు వాజ్పేయీ సేవలను స్మరించుకున్నారు.