హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యాగంటిలో వైభవంగా పల్లకి సేవ

NDL: బనగానపల్లె మండలంలో ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి, శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం ఆలయ ఏవో డి పాండు రంగారెడ్డి, ఆలయ చైర్మన్ బండి మౌళేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా పల్లకి సేవ జరిగింది. సాయంత్రం ఆలయ వేద పండితులు స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి, ఆలయ మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.పల్లకి సేవలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.