హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుండి రైల్వే గేటు మూసివేత

WG: ఉండి మండలం వాండ్రం రైల్వే గేటును మంగళవారం ఉదయం నుంచి గురువారం రాత్రి వరకు మూడు రోజుల పాటు మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. మరమ్మతు పనుల కారణంగా గేటు మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉండి నుంచి వాండ్రం, కోపల్లె, కాళ్ల వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు, విద్యార్థులు, రైతులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.