హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రామానుజాచార్యుల విధానాలే పునాది'

తిరుమల వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో భగవద్ రామానుజాచార్యులు నిర్దేశించిన కైంకర్య విధానాలు నేటికీ సక్రమంగా కొనసాగుతున్నాయని తిరుమల పెద్ద జీయర్ స్వామి తెలిపారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో “శ్రీవైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలు” అనే అంశంపై జాతీయ సదస్సు నిన్న సోమవారం చాలా ఘనంగా ప్రారంభమైందన్నారు.