W.G: ప్రేమించిన వివాహిత పెళ్లికి నిరాకరించిందని మనస్తాపంతో గడ్డిమందు తాగిన బొండపల్లి కుమార్ (27) కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో సోమవారం మృతి చెందారని సీఐ పి. విశ్వం తెలిపారు. పోలవరం మండలం పాత పట్టిసీమకు చెందిన కుమార్ భీమవరంలో పని చేస్తుండగా, అక్కడ ఓ వివాహితను ప్రేమించారు. తనకు ఇద్దరు పిల్లలున్నారని ఆమె అతని ప్రేమను తిరస్కరించడంతో కొవ్వూరులో గడ్డిమందు తాగారు.
ఆంధ్రప్రదేశ్
వివాహిత పెళ్లికి నిరాకరణ.. యువకుడి ఆత్మహత్య


