హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వ్యర్ధాలను తొలగించండి మహా ప్రభో

W.G: మండల కేంద్రమైన ఉండి పెద ఆంజనేయ స్వామి విగ్రహం వెనుక జన్మభూమి పార్కు వద్ద ఉండి పంటకాలువ దుస్థితి ఇది. చెట్టు కొమ్మలు పంటకాలువలోకి వాలటంతో అపరిశుభ్రంగా తయారైంది. వ్యర్ధాలుతో నిండిపోయింది. అటు అధికారులు కానీ ఇటు రాజకీయనాయకులు కానీ పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. గుర్రపు డెక్క, ఇతర వ్యర్ధాలను తక్షణమే తొలగించాలని వారు కోరుచున్నారు.