హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్రమంగా ఇసుక తరలింపు.. సీన్ కట్ చేస్తే!

ప్రకాశం: జరుగుమల్లి మండలం కామేపల్లి ఏటి నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్‌ను మైనింగ్ డిపార్ట్‌మెంట్ వారు పట్టుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలించే క్రమంలో వీరు టిప్పర్‌ను స్వాధీనం చేసుకొని జరుగుమల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మండలంలో ఎక్కడైనా అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా మైనింగ్ డిపార్ట్మెంట్ వారు హెచ్చరించారు.