హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

గోరువెచ్చని నీళ్లు తాగుతున్నారా..?

ప్రతిరోజూ ఉదయం పరగడుపున లేదా రోజంతా గోరువెచ్చని నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి, శరీరంలోని మలినాలను బయటకు పంపడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి ఇది చక్కటి సహజ ఔషధంలా పనిచేస్తుంది. గోరువెచ్చని నీళ్లు రక్త ప్రసరణను సక్రమంగా ఉంచి, ఒత్తిడిని తగ్గించి శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుతాయి.