KRNL: ఉప విభాగంలోని నాలుగు మండలాల్లో 85,170 ఎకరాల్లో పంట నమోదు (ఈ క్రాప్) చేసినట్లు ఏడీఏ ఎస్.మహమ్మద్ ఖాద్రీ తెలిపారు. ఎమ్మిగనూరు మండలంలో 23,664 ఎకరాలు, నందవరంలో 15,602 ఎకరాలు, గోనెగండ్లలో 30,160 ఎకరాలు, మంత్రాలయంలో 15,544 ఎకరాల్లో పంట నమోదు పూర్తయ్యిందని పేర్కొన్నారు. ఆగస్టు చివరి నాటికి 100 శాతం పంట నమోదుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
85,170 ఎకరాల్లో పంట నమోదు!


