GNTR: తెనాలి ఐతానగర్ వైవీఆర్ కాలనీకి చెందిన ఉడ్ పాలిష్ వర్కర్ పులివర్తి పార్వతీశ్వర్ అలియాస్ పార్ధు (21) గత నెల 31న పనికి వెళ్లి అదృశ్యమయ్యాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో టూ టౌన్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఇదే ప్రాంతంలో గుర్తుతెలియని మృతదేహం లభించగా, అది పార్ధుదే అయి ఉండొచ్చని భావించినా కుటుంబసభ్యులు గుర్తించలేదు. రెండు కేసులపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్
తెనాలి ఐతానగర్‌లో యువకుడి అదృశ్యం


