హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రమాదకరంగా కంఠవరం కల్వర్టు

ASR: జి.మాడుగుల మండలంలో కల్వర్టు కుంగిపోవడం, రహదారి పూర్తిగా దెబ్బతినడంతో సొలభం, గడుతూరు, వంతాల, పెదలోచలి ప్రజలకు రవాణా కష్టాలు మొదలయ్యాయి. భారీ గుంతలు ఏర్పడి వర్షపు నీరు నిలవడంతో రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ప్రమాదాల బారిన పడుతున్నారు. దీనిపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.