హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రౌడీ షీటర్ అనుమానాస్పద మృతి

కృష్ణా: క్రీస్తురాజపురంలో రౌడీ షీటర్ బాలస్వామి మృతి చెందాడు. మాచవరం పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీట్ హోల్డర్‌గా ఉన్న బాలస్వామి నివాసం ఉంటున్న ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు ఆదివారం ఇంట్లో పరిశీలించారు. అక్కడ బాలస్వామి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.