హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రమాదంలో ఒకరి మృతి..!

ELR: దెందులూరు మండలం నాగులదేవునిపాడు వద్ద 16వ తేదీన జరిగిన రహదారి ప్రమాదంలో పెదవేగి మండలం కొప్పులవారిగూడెం గ్రామానికి చెందిన పామర్తి వెంకటేశ్వరరావు(55) మృతి చెందగా అతని భార్య లక్ష్మి సుజాతకు గాయాలయ్యాయని దెందులూరు పోలీసులు సోమవారం తెలిపారు. భార్యాభర్తలు బైక్ పై ఏలూరు వెళ్లి వస్తుండగా నాగులదేవునిపాడు వద్ద వెనుక నుంచి మరో బైక్ ఢీకొంది.