KRNL: కర్నూలు నగరంలోని అశోక్‌నగర్ నీటి శుద్ధి కేంద్రంలో నిర్వహణ, మరమ్మతులు, పూడిక తొలగింపు పనులు పూర్తయ్యాయి. దీంతో సోమవారం అర్ధరాత్రి నుంచి నగరంలో తాగునీటి సరఫరాను యథావిధిగా పునరుద్ధరించనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. నీటి సరఫరా అంతరాయానికి ప్రజలు సహకరించినందుకు ఈ సందర్భంగా కమిషనర్ ఓబులేసు ధన్యవాదాలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అర్ధరాత్రి నుంచి నీటి సరఫరా పునరుద్ధరణ


