హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భార్యను చంపి భర్త ఆత్మహత్యాయత్నం

తూ.గో: రాజానగరం మండలం చక్రద్వారబంధంలో భార్య మట్టపర్తి కుమారి(23)ని భర్త నాగరాబాబు గొంతు నులిమి హత్య చేసినట్లు CI వీరయ్య గౌడ్ సోమవారం తెలిపారు. పెళ్లయిన రెండేళ్లుగా భార్యతో సఖ్యత లేకపోవడమే కారణమని విచారణలో తేలిందన్నారు. భార్యను హతమార్చిన తర్వాత నాగబాబు కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిపారు. అతడిని చికిత్స కోసం జీఎస్ఎల్ ఆసుపత్రికి తరలించారు.