ATP: అనంతపురం కోర్టులో ఒక కేసులో నకిలీ సాక్షి హాజరయ్యాడు. జడ్జి సదరు సాక్షిని తండ్రి పేరు అడగ్గా తప్పు చెప్పడంతో వాస్తవం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులపై జడ్జి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగితాల్లో ఉన్న సంతకం తనది కాదని సాక్షి చెప్పడంతో ప్రాసిక్యూటర్ సదరు సాక్ష్యాన్ని తొలగిస్తూ మెమో దాఖలు చేశారు. అనంతరం కఠిన చర్యలు ఉంటాయని జడ్జి హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
కోర్టుకు నకిలీ సాక్షి.. పోలీసులపై జడ్జి ఆగ్రహం


