హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జిల్లాకు 'చంద్రన్న మార్కాపురం' పేరు పెట్టాలి'

ప్రకాశం: మార్కాపురం జిల్లాకు 'చంద్రన్న మార్కాపురం' పేరు పెట్టాలంటూ స్థానిక MLA కందుల నారాయణరెడ్డి ప్రతిపాదన చేశారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నకు వినతి పత్రం కూడా సమర్పించారు. దీనిపై సభలో తీర్మానం ప్రవేశపెట్టాలని, ఇది తమ జిల్లా ప్రజల కోరిక అని పేర్కొన్నారు. గతేడాది ప్రకాశంలో భాగమైన మార్కాపురాన్ని జిల్లాగా ప్రభుత్వం ప్రకటించింది.