హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐటిఐలో ప్రవేశానికి దరఖాస్తులు

CTR: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో ఖాళీ సీట్లకు మూడవ దఫా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ రవీంద్రారెడ్డి ఒక ప్రటకనలో తెలిపారు. ఈ నెల 19వ తేదీలోపు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో చేసుకోవాలన్నారు. ప్రభుత్వ ఐటిఐలో 20న, ప్రైవేటు ఐటిఐలో 21న కౌన్సిలింగ్ ఉంటుందని వెల్లడించారు.