హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

CTR: రామకుప్పం, శాంతిపురం మండలాల పరిధిలోని పలు 33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌లలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని రెస్కో డీఈ (ఆపరేషన్స్) హిమ్మత్ సాగర్ తెలిపారు. విద్యుత్ స్తంభాల స్థానంలో టవర్ల ఏర్పాటు పనులు చేస్తున్నట్టు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.