PPM: సీతంపేట ఉన్నత పాఠశాల వద్ద మంగళవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఉచిత నేత్ర వైద్య శిబిరం జరుగుతుందని ప్రాంతీయాసుపత్రి పర్యవేక్షకుడు బి. శ్రీనివాసరావు తెలిపారు. పుష్పగిరి ఆసుపత్రి ఆధ్వర్యంలో జరిగే ఈ శిబిరంలో శస్త్రచికిత్స అవసరమైన వారికి ఉచిత చికిత్స, భోజనం, వసతి, రవాణా అందిస్తారు. గుర్తింపు కార్డు, ఫోన్ నంబరు తీసుకురావాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఉచిత కంటి వైద్య శిబిరం


