హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

TPT: చంద్రగిరి గ్రామీణ ప్రాంతాల్లోని విద్యుత్ సరఫరాకు ఇవాళ అంతరాయం ఏర్పడనుంది. విద్యుత్ లైన్ల నిర్వహణ, మరమ్మతు పనుల కారణంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ డీఈఈ పి.శేషాద్రి రెడ్డి తెలిపారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి, సహకరించాలని కోరారు.