హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటితో ముగియనున్న డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాలు

TPT: డిగ్రీ ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు మంగళవారంతో ముగియనుంది. ఆగస్టు 15 నుంచి 19 మధ్య ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. 20వ తేదీ వరకు హెల్ప్ డెస్క్‌లలో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఆగస్టు 31న సీట్లు కేటాయించి అదే రోజు తరగతులు ప్రారంభిస్తారు. జిల్లాలోని TTD 4 డిగ్రీ కళాశాలల్లో 3,736 సీట్లకు 16 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు.