హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖలో ఆర్మీ నియామక ర్యాలీ

విశాఖలో సెప్టెంబర్ 3 నుంచి 20 వరకు ఆర్మీ నియామక ర్యాలీ జరగనుండగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాత పరీక్షలో అర్హత సాధించిన 10,355 మంది అభ్యర్థులు పాల్గొంటారని తెలిపారు. ట్రాఫిక్,బందోబస్తు,తాగునీరు,వైద్య,వసతి,విద్యుత్ ఏర్పాట్లు చేయాలన్నారు.