హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాల్మీకిపురంలో సీతారాముల శాంతి కల్యాణం

అన్నమయ్య: వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి మహోత్సవాల్లో భాగంగా నేడు సీతారాముల శాంతి కల్యాణం, హనుమంత వాహనసేవ నిర్వహించనున్నారు. ఉదయం యాగశాల పూజ, 10 గంటలకు స్నపన తిరుమంజనం, సాయంత్రం ఊంజల్ సేవ అనంతరం కల్యాణం జరుగుతుంది. ఆగస్టు 19న శ్రీరామ పట్టాభిషేకం, గరుడ వాహనసేవ నిర్వహించనున్నారు. రూ.300తో దంపతులు ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు.