కడప: జిల్లాలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. సోమవారం నిర్వహించిన తనిఖీల్లో 407 కేసులు నమోదు చేసి రూ. 96,545 జరిమానా విధించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. రాంగ్‌రూట్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తప్పవన్నారు.
ఆంధ్రప్రదేశ్
ట్రాఫిక్ ఉల్లంఘనలపై పోలీసుల కొరడా


