హైదరాబాద్: 28°C
తెలంగాణ

వెలగని లైట్లు ఎందుకు..

MHBD: తొర్రూరు మున్సిపాలిటీలోని అన్నారం రోడ్డులో ఉన్న విద్యుత్ లైట్లు గత రెండు రోజులుగా వెలగకపోవడంతో రాత్రి వేళలో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం అటువైపు మున్సిపల్ అధికారులు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవని స్థానికులు మండిపడుతున్నారు. తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి విద్యుత్ లైట్లకు మరమ్మత్తులు చేపట్టాలని కోరుతున్నారు.