హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వీధి దీపాలు లేక అవస్థలు

ప్రకాశం: కంభం విద్యానగర్ ఆంజనేయ స్వామి ఆలయం వెనుక ప్రాంతంలో వీధి దీపాలు వెలగక స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో చీకటితో పాటు పందులు, కుక్కల బెడదతో ప్రజలు అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. వీధి దీపాలు ఏర్పాటు చేసి, పందులు, కుక్కల సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.