HYD: జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మెగాస్టార్ చిరంజీవి, ఎమ్మెల్సీ నాగబాబును అభినందించారు. ఏపీ-గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా కేబినెట్ హోదాతో నియమితులైన సందర్భంగా నాగబాబుకు చిరంజీవి పూలమాల వేసి సత్కరించారు. అనంతరం పెన్నును బహుమతిగా అందించి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త బాధ్యతల్లో నాగబాబు విజయవంతంగా రాణించాలని చిరంజీవి ఆకాంక్షించారు.
తెలంగాణ
నాగబాబుకు చిరంజీవి ఘన సన్మానం


