హైదరాబాద్: 28°C
వ్యాపారం

రూ.300తో ఏడాది పాటు టారిఫ్‌ గ్యారెంటీ!

తన ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను జియో మరోసారి తీసుకొచ్చింది. రూ.300తో సభ్యత్వం తీసుకుంటే ఏడాది పాటు ధరల పెరుగుదల నుంచి రక్షణ పొందొచ్చని సంస్థ తెలిపింది. ఈ ఏడాదిలోపు జియో టారిఫ్‌లను సవరించినా ప్రైమ్ మెంబర్లకు ఛార్జీల భారం పడదు. జియో ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ యూజర్లకు వర్తిస్తుంది. ఈ ప్లాన్‌తో రూ.600 క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలను కూడా జియో అందిస్తోంది.