హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెట్లబావి వద్ద తలసాని ప్రత్యేక పూజలు

HYD: శ్రావణ మాసం సందర్భంగా సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బన్సీలాల్‌పేటలోని చారిత్రక మెట్లబావి వద్ద ఎర్ర పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.