హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘోర రోడ్డు ప్రమాదం

NLG: నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిన్నమునిగల్ గ్రామానికి చెందిన కేతావత్ దేవ్ సింగ్ అలియాస్ చిరు నాయక్ (24) బైక్‌పై నుంచి కిందపడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘోర విషాదంతో చిన్నమునిగల్ గ్రామంలో తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి. మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.