హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ తీరుపై బీజేవైఎం ఆగ్రహం

MDCL: హైదరాబాద్ నాంపల్లిలో వందేమాతరం గేయంపై కాంగ్రెస్ నేతల తీరును నిరసిస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే మాట్లాడుతూ జాతీయ గేయాన్ని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. కాంగ్రెస్ నేతలు తమ వైఖరిపై స్పష్టత ఇచ్చి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం వందేమాతరం ఆలపించి నిరసన తెలిపారు.