హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'కాకినాడలో మద్యం అమ్మకాలను అరికట్టాలి'

కాకినాడ నగరంలో విచ్చలవిడిగా జరుగుతున్న మద్యం అమ్మకాలను అరికట్టాలని శ్రామిక మహిళ సమన్వయ కమిటీ, సీఐటీయూ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. నగరంలోని 36 మద్యం దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, అధికారుల పర్యవేక్షణకు అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. మద్యం దుకాణాలు నిర్ణీత సమయపాలన పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.